మజ్జిగ మంత్రం..ఇదీ భారతీయుడి స్వతంత్ర తంత్రమే

updated: March 7, 2018 10:42 IST
మజ్జిగ మంత్రం..ఇదీ భారతీయుడి  స్వతంత్ర తంత్రమే

మజ్జిగ...దీని గురించి తెలియని భారతీయలు ఉండరు. ఏ ప్రాంతంలో ఏ పేరుతో పిలిచినా మజ్జిగను మహద్బాగ్యంగా భావించి సేవిస్తూంటారు మనవాళ్లు.  పెరుగును చిలికితే వచ్చే మజ్జిగ ని ఎక్కువగా వేసవి తాపాన్ని తీర్చే సహజసిద్ధ అమృతం పరిగణిస్తూంటాం. దీన్నే మనం ‘చల్ల’ అని కూడా అంటాం. ఇక మన ఇళ్లలో అయితే ఎండన పడి వచ్చిన వాళ్లు చల్లని మజ్జికతో తేరుకుంటూంటారు. అలాగే ఇంట్లో ఎవరికన్నా వేడి చేసింది అనిపిస్తే వెంటనే అందివ్వాల్సింది పంచదార కలిపిన మజ్జిగే. ఇక పిల్లలకు కడుపు చలవ కోసం మజ్జిగ అన్నం పెట్టాల్సిందే. కుర్రాళ్లు బయిటకు వెళ్లినప్పుడు.. మజ్జిగలో చక్కెర, ఐస్‌క్రీం వంటివి వేసిన ‘లస్సి’ లు పట్టించాల్సిందే.  పెద్దవాళ్లైతే మజ్జిగను భోజనంలో చివరగా తింటుంటారు. 

 

ఇక  ఈ మజ్జిగ తయారీలో కాస్త శ్రద్ధ పెడితే మరిన్ని ప్రయోజనాలు పొందే అవకాసం ఉంది.  పెరుగులో కొన్ని నీళ్లు పోసి చిలికి, అందులో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపు ఉంచితే మజ్జిగ ఇంకా రుచిగా తయారవుతుంది. దీన్ని దాహాన్ని తీర్చే చక్కని పానీయంగా ఉపయోగించుకోవచ్చు.ముఖ్యంగా వేసవిలో పెట్టే చలివేంద్రాలలో ఎండలో వచ్చిన వారి దాహాన్ని తీర్చి తక్షణ శక్తి కోసం ఈ రకంగా తయారు చేసిన మజ్జిగను పంచుతారు.  

ఇలా కేవలం మజ్జిగను కేవలం ఓ పానీయంగానే తీసుకోకుండా... ఆహారంగానూ తయారు చేసేటప్పుడూ వాడుతూంటారు. ఉదాహరరణకి ..నీటికి బదులు మజ్జిగ వేసి ఉప్మాను తయారు చేస్తారు. దీన్ని ‘మజ్జిగ ఉప్మా’ అంటారు.  అలాగే మజ్జిగను పోపుచేసి ‘మజ్జిగ చారు’, మెంతులు వేసి మజ్జిగలో మెంతి మజ్జిగ, లేదా ‘మజ్జిగ పులుసు’(చల్ల పులుసు) ను తయారు చేస్తారు. ఇలా ప్రతీసారి మజ్జిగ మంత్రాన్ని అందరూ పఠిస్తూనే ఉంటారు.

ఇక ఇప్పుడు ఎండాకాలం కూడా వచ్చేసింది.  ఎండ ప్రతాపం రెండు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగిపోతోంది. ఉదయం 8 గంటల నుండే వేడి వాతావరణం కనపడుతుంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వేడి వాతావరణంతో పిల్లలకు, వృద్ధులు ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు. ఈ వేసవి నుంచి ఉపశమనం పొందాలంటే  మజ్జిగ మాత్రమే ఉపశమనం ఇస్తుంది. వేసవిలో వచ్చే సమస్యలైన తలనొప్పి, ఒళ్లుమంట, డీ హైడ్రేషన్ లాంటి సమస్యలు నుంచి ఈ మజ్జిగ చక్కని పరిష్కారం ఇస్తుందనటంలో సందేహం లేదు

Photo by Kim Gorga on Unsplash

 

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

comments